News December 31, 2024
పేపర్ లీక్ చేసిన వ్యక్తి ఉమ్మడి తూ.గో. వాసే
పదో తరగతి SA-1 పరీక్షల్లో లెక్కల పేపర్ లీక్‌కు కారణమైన ఉమ్మడి తూ.గో.(D) రామచంద్రపురం మండల విద్యాశాఖాధారితోపాటు టీచర్ సుబ్బారావును విజయవాడ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో సోమవారం హాజరుపరచగా రిమాండ్ విధించారు. మండలంలోని హైస్కూల్‌లో ఓ విద్యార్థికి ప్రశ్నపత్రాన్ని ఆయన ఇవ్వగా.. బాలిక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. వెంటనే ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్షమవడంతో విషయం తెలిసింది.
Similar News
News January 4, 2025
ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషి మాతా దేవాలయం వద్ద హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 3, 2025
రాజానగరం హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
రాజానగరం గైట్ కళాశాల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రేడుకు చెందిన భరత్ చంద్ర (20) మృతి చెందాడు. స్నేహితుడి నాగేంద్రతో కలసి బైక్‌పై రాజానగరం నుంచి రాజమండ్రి వెళుతూ ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ హేండిల్ లారీకి తగిలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో లారీ భరత్‌పై నుంచి వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
News January 3, 2025
రాజమండ్రి : ‘గేమ్ ఛేంజర్’ పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు
రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్‌లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.