News December 15, 2025
పేరుకే మహిళలు.. పెత్తనం పురుషులదే!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అంటూనే భార్యలు గెలిస్తే భర్తలు రూల్ చేయడం సాధారణమైపోయింది. పేరు మహిళలదే అయినప్పటికీ పెత్తనం మాత్రం పురుషులు చెలాయిస్తున్నారు. చాలా చోట్ల వారిని రబ్బరు స్టాంపుగానే చూస్తున్నారు. ఇదే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఈ నెల 22లోపు నివేదికలు ఇవ్వాలని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది.
Similar News
News December 15, 2025
మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్‌లో గ్రీట్ అండ్ మీట్‌లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.
News December 15, 2025
భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

<
News December 15, 2025
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్

లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతు కరిధాల్ 1997లో ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా చేరారు. ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన మార్స్ ఆర్బిటార్ మిషన్, మంగళ్‌యాన్ ప్రయోగాలకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2కి మిషన్ డైరెక్టర్‌గా రీతూ బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.


