News December 16, 2025

పేరుపాలెంబీచ్‌లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

image

పేరుపాలెం బీచ్‌లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 19, 2025

ధాన్యం కొనుగోలు పురోగతిపై జేసీ సమీక్ష

image

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని జేసీ రాహుల్ అన్నారు. జేసి ఛాంబర్‌లో గురువారం ధాన్యం కొనుగోలు పురోగతిపై అధికారులతో మండలాల వారీగా సమీక్షించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పురోగతిపై ధాన్యం సేకరణ కేంద్రాలు పనితీరు, రైతులు చెల్లింపులు లక్ష్యాలు, సాధనపై అడిగి తెలుసుకున్నారు.

News December 18, 2025

కోరుకొల్లులో సినిమా షూటింగ్ సందడి

image

పాలకోడేరు మండలం కోరుకొల్లులో గురువారం ‘తెల్ల కాగితం’ సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. హీరో రోషన్‌, హీరోయిన్‌ వైష్ణవిలపై దర్శకుడు రమేష్‌ పలు సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. చిత్ర విశేషాలు బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ పేర్కొంది.