News November 14, 2024

పేరుపాలెం బీచ్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

image

లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ ముస్సూరీకి చెందిన పదిమంది ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం మొగల్తూరు మండలం బీచ్‌ను సందర్శించారు. వీరికి మొగల్తూరు మండల తహశీల్దార్ కిషోర్, ఎంపీడీవో, ఎంపీడీవో త్రిశూలపానీలు బీచ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుపాలెం సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా ఎంతో రమ్యంగా ఉందని ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News February 1, 2025

భీమవరం: ‘చనిపోయిన తాబేళ్లకు పోస్టుమార్టం చేయాలి’

image

పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో మత్స్యశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. చనిపోయిన తాబేళ్లు చినమైనివారిలంక, పెద్దమైనివారిలంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి గల కారణాలపై సమీక్షించారు. వాటికి పోస్టుమార్టం చేయాలని ఆదేశించారు.

News February 1, 2025

నరసాపురం: కాలువలో మృతదేహం

image

వేటాడేందుకు వెళ్లిన మత్స్యకారుడు కాలువలో పడి మృతి చెందిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామం ముస్కెపాలెంకు చెందిన కొపనాతి లక్ష్మణ్(57) శుక్రవారం వేటాడేందుకు కాలువలోకి వెళ్లాడు. ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల గాలించినా లక్ష్మణ్ జాడ తెలియలేదు. శనివారం వేములదీవి కాలువలో శవమై కనిపించాడు. 

News February 1, 2025

తణుకు ఎస్ఐ మృతదేహానికి నేడు అంత్యక్రియలు

image

తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్ మూర్తి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గంగవరం గ్రామానికి తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.