News November 7, 2025
పేరు గొప్ప.. వికారాబాద్ దిబ్బా.!

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా వికారాబాద్ జిల్లా పరిస్థితి మారింది. VKB జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మరెన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా జిల్లాను పాలకులు అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి ఉద్దండ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం గమనర్హం.
Similar News
News November 7, 2025
నేడు కడపలో భారీ ర్యాలీ

WWC భారత్ గెలిచిన తర్వాత తొలిసారి కడపకు నల్లపురెడ్డి శ్రీచరణి నేడు రానున్నారు. కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు ఇర్కాన్ సర్కిల్ వద్ద సాయంత్రం స్వాగతం పలుకుతారు. తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేస్తారు. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆమెను సన్మానిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆమె సాయంత్రానికి కడపకు వస్తారు.
News November 7, 2025
ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.
News November 7, 2025
త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.


