News September 23, 2025
పేరు జూబ్లీహిల్స్.. ఊరు ఖైరతాబాద్

మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదనేది ఎంత నిజమో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఉండదనేది అంతే నిజం. ఉప ఎన్నిక సమీపిస్తోంది. అంతటా ప్రచారం చేస్తోన్న నాయకులు జూబ్లీహిల్స్ డివిజన్‌ను టచ్ చేయడం లేదు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, షేక్‌పేట, రహమత్‌నగర్, వెంగళరావునగర్, సోమాజిగూడ(PART)లో పర్యటిస్తున్నారు. పేరుకే ‘జూబ్లీహిల్స్’ అయినా ఈ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉండటం గమనార్హం.
Similar News
News September 23, 2025
జూబ్లీహిల్స్ క్లాస్ అనుకుంటున్నారా.. ఊర మాస్!

జూబ్లీహిల్స్‌ను అంతా కాస్ట్‌లీ నియోజకవర్గమని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో గ్రాండ్‌గా కనిపిస్తది. కానీ, జూబ్లీహిల్స్ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికి తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడలోని మధ్య తరగతి, పేదలే ఓట్లేస్తారు. ఇక్కడ అందమైన భవంతులే కాదు అంతకుమించి బస్తీలున్నాయి.
News September 23, 2025
HYD: సన్ సిటీలో అల్లకాస్ షాపింగ్ మాల్ ప్రారంభం

బండ్లగూడ జాగీర్‌లోని సన్ సిటీ సమీపంలో సోమవారం అల్లకాస్ నూతన షాపింగ్ మాల్ ప్రారంభమైంది. అర్ధ శతాబ్దపు అనుభవంతో నాలుగు అంతస్థుల భవనంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినట్లు అల్లకాస్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ ఫ్యాషన్ ల్యాండ్‌స్కేప్‌ను ఉన్నతీకరించడంలో ఇది ఒక మైలురాయిగా పేర్కొన్నారు. బండ్లగూడలో 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తుండటంతో కూడా ఆనందం వ్యక్తం చేశారు.
News September 23, 2025
HYD: రోప్‌వే కోసం HMDA అడుగులు!

హైదరాబాద్.. చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. గొప్ప వారసత్వ సంపద కలిగిన నగరాన్ని లక్షలాది మంది సందర్శిస్తుంటారు. సిటీకి వచ్చే టూరిస్టులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు HMDA రోప్‌వేకు ప్లాన్ చేస్తోంది. గోల్కొండ నుంచి 7 టూంబ్స్ వరకు రోప్‌వే నిర్మించాలని నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయడం కోసం నైట్ ఫ్రాంక్ అనే సంస్థను ఎంపిక చేసింది. 3 నెలలో HMDAకు ఈ సంస్థ నివేదిక అందజేయాల్సి ఉంది.