News December 20, 2025
పేరెంట్స్ మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో!

AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్యకుమార్ సూచించారు. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్‌లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్‌లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.
Similar News
News December 20, 2025
ఈ కలుపు మందులతో వయ్యారిభామ నిర్మూలన

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.
News December 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 102

ఈరోజు ప్రశ్న: విష్ణువు గుర్రపు తలతో ఎత్తిన అవతారం పేరేంటి? ఎందుకు ఆ రూపం ధరించాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 20, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


