News December 27, 2024
పేర్ని జయసుధ బెయిల్ పిటీషన్‌పై ముగిసిన వాదనలు
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News December 28, 2024
విజయవాడలో ప్రారంభమైన తెలుగు మహాసభలు
ప్రపంచ 6వ తెలుగు మహాసభలు శనివారం విజయవాడలోని KBN కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు నిర్వాహకులు 3 సభావేదికలు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు మాజీ CJI ఎన్వీ రమణ, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవిదేశాల నుంచి 1500 మందికిపైగా కవులు, రచయితలు ఈ సభలకు తరలివచ్చారు.
News December 28, 2024
ఇబ్రహీంపట్నం: బాలికపై పాస్టర్ అత్యాచారం.. కేసు నమోదు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్‌ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొండపల్లిలో నివాసముంటున్న బాలిక కుటుంబానికి పాస్టర్ దగ్గరి బంధువు. తెలంగాణ నుంచి అప్పుడప్పుడు కొండపల్లిలోని బాలిక నివాసానికి వచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 28, 2024
VJA: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. చిట్టినగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక(14)ను వించిపేటకు చెందిన చెన్నా రవీంద్ర అనే యువకుడు మాయమాటలు చెప్పి ఈనెల 26న అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.