News January 23, 2025
పేర్లు రానివారు దరఖాస్తు సమర్పించాలి: ASF కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల అమల్లో భాగంగా గ్రామసభలలో చదివే జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
WNP: భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి(D) పెబ్బేరులో జరిగింది. ‘మహేందర్, సువర్ణ చెలిమిళ్లలో నివాసముంటున్నారు. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకొని సువర్ణను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. శుక్రవారం కూడా అతడు భార్యతో గొడవపడ్డాడు. మనస్థాపానికి గురైన సువర్ణ ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది’ అని పోలీసులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News November 2, 2025
ఏపీ రౌండప్

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్‌సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్‌తో పోలిస్తే 8.77శాతం వృద్ధి
News November 2, 2025
SRCL: ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

జిల్లా పరిధిలోని కోర్టుల్లో ఈ నెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కాంపౌండబుల్ క్రిమినల్, సివిల్, మోటారు వాహన, బ్యాంక్, కుటుంబతగాదాల కేసుల పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఏర్పాటుచేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


