News September 6, 2025
పేలుడు పదార్థాలు గుర్తించడంలో ‘హంటర్’ కీలకం: ఎస్పీ

పేలుడు పదార్థాలు గుర్తించడంలో బెల్జియం దేశ మలునాయిస్ జాతికి చెందిన హంటర్ డాగ్ కీలకమైన సేవలు అందిస్తుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన హంటర్ డాగ్‌ను ఎస్పీ తన ఛాంబర్‌లో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో హంటర్ డాగ్ 10 నెలల పాటు శిక్షణ తీసుకుందని, అసాంఘిక శక్తులు చేసే కుట్రలను ఈ డాగ్ పసిగడుతుందన్నారు.
Similar News
News September 6, 2025
ఆదోని జిల్లాలో 3 మండలాలు.. మున్సిపాలిటీ?

కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తోంది. నియోజకవర్గంలో 44 గ్రామాలను 3 మండలాలుగా విభజించారు. 15 గ్రామాలను కలుపుతూ అరేకల్లు మండల కేంద్రంగా, 14 గ్రామాలను కలిపి పెద్దతుంబలం మండల కేంద్రంగా, 11 గ్రామాలను ఆదోని రూరల్ మండలంగా, 4 గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దీనిపై అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
News September 5, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టీజీ భరత్

కర్నూలు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి టీజీ భరత్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, హాస్పిటల్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అంతకు ముందు పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ ప్రతినిధులు మంత్రి చేతుల మీదుగా 10 స్ట్రెచర్లను హాస్పిటల్‌కు ఇచ్చారు.
News September 5, 2025
రేషన్ షాపుల్లో ఉల్లి కిలో రూ.12: కలెక్టర్

కర్నూలులోని 170 రేషన్ డిపోల్లో ఉల్లి కిలో రూ.12కు విక్రయిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డును చూపించి కార్డుదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. నగరంలోని హోటళ్ల యాజమానులు కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లిని సబ్సిడీ ధరకే కొనుగోలు చేయవచ్చన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.