News October 7, 2025
పైడితల్లమ్మ కరుణతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి: లోకేశ్

విజయనగరం శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి.. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మవారి కరుణతో రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ‘X’వేదికగా పైడితల్లి అమ్మవారి ఫోటో పెట్టారు.
Similar News
News October 7, 2025
నాణ్యతా తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా?

దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2022లోనూ మన దేశం నుంచి ఎగుమతైన మందుల వల్ల గాంబియాలో డజనుకు పైగా పిల్లలు మరణించారు. అయినా వాటి నుంచి ఎందుకు పాఠాలు నేర్చుకోలేదని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఔషధ తయారీలో వ్యవస్థాపరమైన లోపాలు అందరికీ ముప్పేనని విమర్శిస్తున్నారు. కాగా ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.
News October 7, 2025
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం: కలెక్టర్

రాయచోటి కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.
News October 7, 2025
జమ్మికుంట: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాజీపేట- రామగుండం రైల్వే లైన్‌లో రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(43) ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదానికి గురై మృతి చెందాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.