News October 7, 2025

పైడిమాంబకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

image

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ఆశీర్వచనాలు పొందారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా నిన్న రాత్రి తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. ఈరోజు సాయంత్రం సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 7, 2025

మహర్షి వాల్మీకి ఆదర్శంతో జిల్లాను అభివృద్ధి చేయాలి

image

వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని జిల్లా అధికారులు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు. యుక్త వయసులో మహర్షి దోపిడీ చేస్తూ దొంగగా జీవించేవారని తన తప్పు తెలుసుకుని మారడంతో వాల్మీకి మహర్షిగా నిలిచాడన్నారు. అధికారులు పాల్గొన్నారు.

News October 7, 2025

కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

image

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.

News October 7, 2025

MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

image

కరూర్ తొక్కిసలాటపై TNలో రాజకీయ చిచ్చు రాజుకుంది. ప్రభుత్వాన్ని పొగిడిన కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై విరుచుకుపడ్డారు. MP సీటుతో DMKకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆయన్ను తమిళ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. కాగా ఇటీవల బాధితుల్ని పరామర్శించిన NDA ఎంపీలు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. కరూర్ ఘటనను BJP రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని CM స్టాలిన్ దానికి కౌంటరిచ్చారు.