News March 5, 2025
పైనంపల్లి గ్రామంలో ఒకేరోజు ముగ్గురు మృతి

ఒకేరోజు ముగ్గురు చనిపోయిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పైనంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ డిఎస్పీ ఉసిరికాయల వెంకటాచలం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు సత్యానందం, పోటు కృష్ణవేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకేరోజు ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 6, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News March 6, 2025
ఖమ్మం కలెక్టర్ GREAT.. దివ్యాంగులకు ఉచిత భోజనం

పాలనలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. విద్యార్థులు, ప్రజలతో మమైకమవుతూ వినూత్న శైలిని అనుసరిస్తున్నారు. సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులు ఖాళీ కడుపుతో వెళ్లొద్దనే భావనతో ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు. 40 శాతం వైకల్యంతో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కలెక్టర్‌కు జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు.
News March 6, 2025
ఖమ్మంలో జిల్లాలో భగ్గుమంటున్న భానుడు!

వేసవి కాలం ప్రారంభంలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ప్రాంతంలో తీవ్రత మరింతగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తీవ్రమైన ఎండ, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరో 3-4 రోజుల్లో ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావారణ శాఖ అంచనా వేస్తుంది.