News November 17, 2025

పైరసీ సైట్లను ఎంకరేజ్ చేయవద్దు: సజ్జనార్

image

TG: ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడని HYD CP సజ్జనార్ తెలిపారు. ‘రవిని పోలీస్ కస్టడీకి కోరాం. విచారణలో పూర్తి వివరాలు రాబడతాం. పైరసీ చేసినా, చూసినా నేరమే. యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయవద్దు’ అని సూచించారు.

Similar News

News November 17, 2025

ఈ మాస్క్‌తో అవాంఛిత రోమాలకు చెక్

image

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వంశపారంపర్యం, హార్మోన్ల అసమతుల్యత, పలు అనారోగ్యాలు, కొన్ని మందులు వాడటం వల్ల ఇవి వస్తాయి. వీటిని తగ్గించాలంటే స్పూన్ జెలటిన్ పొడి, పాలు, తేనె, పసుపు కలిపి క్లీన్ చేసిన ముఖానికి అప్లై చేసుకోవాలి. కనుబొమ్మలు, కంటికి అంటకుండా మాస్క్ వేయాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా తొలగించాలి. తర్వాత ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్ది మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.

66 ఏళ్ల రికార్డు.. ఇండియాలో ఫస్ట్ టైమ్ నమోదు!

image

నిన్న దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియాకు అనూహ్య <<18303459>>ఓటమి<<>> ఎదురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్సులు పూర్తయి కనీసం ఒక్కదాంట్లోనూ 200కు పైగా పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టుల్లో 12 సార్లు ఇలా జరిగింది. చివరిసారిగా 66 ఏళ్ల క్రితం ఈ తరహా రికార్డు నమోదైంది.