News September 7, 2024
పైలట్ ప్రాజెక్ట్‌గా పిఠాపురం

పర్యావరణహితంగా వినాయక చవితి చేపట్టాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 2 నెలల క్రితం ప్రత్యేకంగా మట్టివిగ్రహాల తయారీపై పలువురికి శిక్షణ ఇప్పించారు. కాగా 2 నెలల్లో 5 అడుగుల మట్టి వినాయక ప్రతిమలు 50, మూడు అడుగులవి 80 తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి రాష్ట్రమంతటా విగ్రహాల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News August 22, 2025
కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
News August 22, 2025
స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 37 స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. అరికిరేవుల, ధవళేశ్వరం, మునిపల్లి వంటి ప్రధాన స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకను నిల్వ ఉంచినట్లు ఆమె వెల్లడించారు. ఇతర జిల్లాలకు సరఫరా చేయడానికి మరిన్ని స్టాక్ పాయింట్లను సిద్ధం చేశామన్నారు.
News August 21, 2025
రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.