News July 6, 2025
పైసా పెట్టు.. కార్డు పట్టు.. జిల్లాల్లో ఇది పరిస్థితి.!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతుంది. కాగా ఇదే అదునుగా భావించి ఇరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్లు రేషన్ కార్డు మంజూరు కోసం చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన రేషన్ కార్డు మంజూరు కోసం రూ.2, 3 వేలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
Similar News
News July 6, 2025
రేపే లాస్ట్.. డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్& అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలో 166 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, లోకల్ భాషలో రాయడం, చదవడం రావాలి. రేపటిలోగా https//aaiclas.aero/career సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.21,000 నుంచి రూ.22,500 వరకు ఉంటుంది.
News July 6, 2025
త్వరలో డబుల్ సెంచరీ చేస్తా: వైభవ్ సూర్యవంశీ

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు స్ఫూర్తి అని అండర్-19 సంచలనం వైభవ్ సూర్యవంశీ అన్నారు. నిన్న ENG అండర్19 జట్టుపై విధ్వంసకర శతకం బాదిన వైభవ్ త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. జట్టు విజయం కోసం రాణించడం బాగుందని తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో ఆడిన నాలుగు వన్డేల్లో వైభవ్ 300+ పరుగులు చేశారు.
News July 6, 2025
రేపు స్కూళ్లకు సెలవు అంటూ మెసేజులు

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సోమవారం సెలవు ప్రకటించాయి. మొహర్రం సందర్భంగా సెలవు అంటూ తల్లిదండ్రులకు మెసేజులు పంపుతున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఇవాళే ఉంది. రేపు అధికారికంగా సెలవు ప్రకటించకపోయినా కొన్ని ప్రైవేట్ స్కూళ్లు మాత్రం హాలిడే ఇచ్చాయి. మరి మీకు సెలవు ఉందని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.