News April 25, 2025
పైసా ఫీజు లేకుండా భూ పరిష్కారం: కలెక్టర్

భూ భారతి చట్టం-2025 ద్వారా రైతుల భూ సమస్య తీర్చడానికి ప్రభుత్వం ద్వారా ఒక పైసా వసూలు చేయబోమని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. డోర్నకల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గత భూ చట్టాల్లో ప్రజలకు ఎదురైన అనేక ఇబ్బందులను సరిదిద్దుతూ, అన్ని విధాలుగా ఆలోచించి ఈ నూతన చట్టాన్ని రూపొందించారన్నారు.
Similar News
News April 25, 2025
నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 25, 2025
గణితంలోనే 3,934 మంది ఫెయిల్

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 3,934 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సైన్సులో 2,555 విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. గణితం ప్రశ్నా పత్రంలో లోపాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రయత్నం చేశారని, అయినా ఫలితాలు నిరాశ కలిగించాయని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రీ-వెరిఫికేషన్‌కు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
News April 25, 2025
కుబీర్: ఇల్లరికం వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు..!

అత్తారింటికి ఇల్లరికానికి వచ్చి భార్యతో గొడవపడి ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన సురేశ్ కుబీర్ లోని అంతర్నీ గ్రామానికి చెందిన రోజాతో వివాహం జరిగింది. అయితే మంగళవారం భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.