News March 29, 2026
పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్

TG: పొంగులేటిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని, ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్‌ను కలుస్తామని KTR స్పష్టం చేశారు. అసెంబ్లీలో <<19499785>>రాఘవ<<>> కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై BRS ఆందోళనకు దిగింది. హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటిని బర్తరఫ్ చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం కేటీఆర్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
Similar News
News April 14, 2026
33 శాతం రిజర్వేషన్ ఆలస్యమైతే మహిళలకు అన్యాయం: మోదీ

చట్ట సభల్లోనూ మహిళలు బలంగా గళమెత్తేందుకు సమయం వచ్చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. వారికి 33 శాతం సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశంలోని నారీమణులకు లేఖ రాశారు. ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును ప్రవేశపెడతామన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే మహిళలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు.
News April 14, 2026
పసికూనపైనే కసికూన అరంగేట్రం!

అనుకున్నట్టే వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులోకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జూన్‌లో జరిగే <<19624839>>ఐర్లాండ్<<>> టీ20 సిరీస్‌కు BCCI తాజాగా అతడి పేరును షార్ట్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనే తరువాయి కానుంది. ఇదే జరిగితే జాతీయ జట్టులో చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టనున్నారు. ఇక పసికూన ఐర్లాండ్‌పై ఈ కసికూన ఎలా చెలరేగుతాడో చూడాలి.
News April 14, 2026
పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.


