News November 20, 2025
పొంచి ఉన్న ప్రమాదం

ధర్మవరం పట్టణం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారి మోటమర్ల గ్రామం వద్ద కల్వర్టుపై రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కల్వర్టుపై ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో కాలువలోకి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని కోరారు.
Similar News
News March 4, 2026
ALERT.. ఈ ఇన్సులిన్ వాడకండి: CDSCO

ఇండియాలో షుగర్ పేషంట్లు ఎక్కువగా వాడే ‘Lantus SoloStar’ ఇన్సులిన్ మందుల బ్యాచ్ (NO. 5F0347B) ఒడిశాలో చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. ఈ ఇన్సులిన్‌ను 2°C నుంచి 8°C మధ్య భద్రపరచాలి. సరైన ఉష్ణోగ్రత లేకపోతే మందు శక్తి కోల్పోయి రోగుల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. మందు కొనే సమయంలో బ్యాచ్ నంబర్ చెక్ చేయాలని అధికారులు సూచించారు. share it
News March 4, 2026
3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్‌మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్‌గా మారింది.