News April 1, 2025

పొందుర్తిలో రైతు ఆత్మహత్య

image

రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన స్వామి రెండు ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. బోరులో నీటిమట్టం తగ్గిపోవడంతో చేతికొచ్చే పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News February 20, 2026

పల్వంచ: రైతులు లాభసాటి పంటల వైపు మళ్లాలి: మంత్రి తుమ్మల

image

రైతులు సంప్రదాయ పంటల నుంచి లాభసాటిగా ఉండే ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పల్వంచకు వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఆయిల్ ఫామ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

News February 20, 2026

భారీ జీతంతో RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

RITES లిమిటెడ్‌ 3 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్, MA/MSc/ఎన్విరాన్‌మెంట్ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లీడర్‌కు నెలకు రూ.3లక్షలు, సేఫ్టీ, హెల్త్& ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌కు నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. మార్చి 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News February 20, 2026

ఉట్నూర్: కట్టెల మోపుల కింద నలిగిపోతున్న బాల్యం

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలంలోని ఓ గ్రామంలో బాల్యంపై బాధ్యతల భారం ఇలా కనిపించింది. మండుతున్న ఎండలో చిన్నారులు తలపై కట్టెల మోసుకుంటూ నడుస్తున్నారు. కుటుంబానికి ఇంధనం సమకూర్చేందుకు బాల్యాన్ని భుజాన వేసుకున్న ఈ దృశ్యం హృదయాలను కదిలిస్తోంది. పాఠశాలకు వెళ్లే వయసులో బాధ్యతలు మోస్తున్న ఈ చిన్నారుల కష్టజీవితం గ్రామీణ వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తోంది. జీవనాధారం కోసం వారి ప్రతి అడుగు పోరాటమే.