News September 20, 2025

పొందూరు: భవనంపై నుంచి జారిపడిన విద్యార్థిని

image

పాఠశాల భవనంపై నుంచి జారిపడి ఓ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పొందూరు(M) లోలుగులోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడింది. తీవ్రగాయాలవ్వడంతో ఆమెను నైట్ డ్యూటీ సిబ్బంది హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 20, 2025

శ్రీకాకుళాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యమవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు . మండలంలోని గనగలవానిపేట సాగర తీరంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొన్నారు.

News September 20, 2025

టీటీడీ ప్రసాదాల తయారీకి సిక్కోలు ఆర్గానిక్ బెల్లం

image

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నిమ్మతొర్లువాడ అనే చిన్న పల్లెటూరులో తయారయ్యే ఆర్గానిక్ బెల్లం చాలా ప్రత్యేకం. తిరుమల ప్రసాదాల తయారీలోనే కాదు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులకు కూడా దీనినే ఉపయోగిస్తున్నారు. టీటీడీ నాణ్యత ప్రమాణాలు తట్టుకొని ‘అగ్ మార్క్ ‘ సర్టిఫికేషన్ పొందిన ఈ బెల్లానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నామని ఇక్కడి తయారీదారులు చెబుతున్నారు.

News September 20, 2025

శ్రీకాకుళం: కలెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చిన సచివాలయ ఉద్యోగులు

image

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరాంధ్ర జేఏసీ కోఆర్డినేటర్ కూన సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు నోటీసును అందజేశారు. రాజకీయ, పలు రకాల ఒత్తిడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. సచివాలయ వ్యవస్థను ద్వితీయ శ్రేణి వ్యవస్థగా చూడడం తగదన్నారు.