News September 20, 2025
పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తాం: కలెక్టర్

పర్చూరు మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పొగాకు రైతులతో మాట్లాడారు. పొగాకు కొనుగోలు ప్రక్రియ మందగిస్తుందని రైతులు తమ సమస్యలను వారికి తెలియజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
Similar News
News September 20, 2025
తిరుమలను వాడుకోవడం CBN, లోకేశ్‌కు అలవాటు: YCP

AP: రాజకీయాల కోసం తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం CBN, <<17773731>>లోకేశ్<<>>కు అలవాటుగా మారిందని YCP మండిపడింది. ‘పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, APLలో. అంటే YCP హయాంలో. పోలీసులు విచారించడంతో అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43కోట్ల ఆస్తులను TTDకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇది చట్టప్రకారం, కోర్టుల న్యాయసూత్రాల ప్రకారం జరిగింది’ అని ట్వీట్ చేసింది.
News September 20, 2025
D.ed విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు

D.ed విద్యార్థులకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉంటాయని గోపాల్‌పేట్ మండలంలోని డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. అక్టోబర్ 4న కళాశాల పునః ప్రారంభం కానున్నదని అన్నారు. దసరా సెలవులను విద్యార్థులు ఆటపాటలతో గడపడంతో పాటు కొంత సమయాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగించుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి 27 డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు.
News September 20, 2025
HYD: రేపు పెత్తరమాస.. ఇలా చేయండి: పురోహితుడు

రేపు (ఆదివారం) పెత్తరమాస (పితృ అమావాస్య) రోజున కుష్మాండ గుమ్మడికాయకు ప్రత్యేక పూజలు చేయాలని HYD అల్వాల్ పరిధి కానాజిగూడలోని మరకత శ్రీలక్ష్మీగణపతి ఆలయ పురోహితుడు డా.మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత, గుమ్మడికాయను ఇంటికి కడితే నరగోష, నర పీడ, నరదృష్టి నుంచి రక్షిస్తుందని తెలిపారు. ఈనెల 22 (సోమవారం) నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయని చెప్పారు. SHARE IT