News November 18, 2025
పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సరిగా కనపడక పోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్‌లైట్లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.
Similar News
News November 18, 2025
కల్వకుర్తి: పత్తి రైతుల సమస్యలు పాలకులకు పట్టవా?: మాజీమంత్రి

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తి పట్టణంలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్‌లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.