News January 3, 2026
పొగ మంచు ఎఫెక్ట్.. కోనసీమను తలపిస్తున్న వేములవాడ

దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వేములవాడ పట్టణం కోనసీమ అందాలను తలపిస్తోంది. తిప్పాపూర్ వేములవాడ మధ్యన ఉన్న బ్రిడ్జి, తిప్పాపూర్ లోని ప్రధాన బస్టాండ్ తదితర ప్రాంతాలు పొగమంచులో లీలగా మాత్రమే కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుండి ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఇబ్బంది పడగా, మార్నింగ్ వాక్ కు వెళ్లినవారు ఈ ఆహ్లాద దృశ్యంతో ఆనంద పరవశులయ్యారు.
Similar News
News February 20, 2026
ప్రకాశం: బీటెక్ విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో విషాదం నెలకొంది. మంగపతివారిపాలెం గ్రామానికి చెందిన మల్లెబోయిన శ్రీచరణ్ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం కాలేజీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పొలాల్లో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్పడానికి వెళ్లాడు. తిరిగి వస్తూ మధ్యలో ఈతకు దిగి మృతిచెందాడు.
News February 20, 2026
ఉదయం పూట ఖర్జూరాలు తింటే..

ఉదయం లేవగానే ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులు, పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వాలని, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో నానబెట్టి ఉదయం తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.
News February 20, 2026
16 శుక్రవారాల కథ..

ఇతర దేశానికి వెళ్లిన తన భర్త క్షేమం కోసం, అత్తామామల వేధింపులు భరిస్తున్న ఓ పేద ఇల్లాలు ఈ వ్రతాన్ని ఆచరించింది. భార్య భక్తికి మెచ్చిన మాత తన భర్తకు కలలో కనిపిస్తుంది. తన భార్య పడుతున్న కష్టాలను వివరిస్తుంది. దీంతో వెంటనే అతను అపారమైన సంపదతో ఇంటికి తిరిగి వస్తాడు. దంపతులిద్దరూ కలిసి అమ్మవారికి కృతజ్ఞతగా ఉద్యాపన చేస్తారు. ఈ కథ కష్టాల్లో దైవం ఎలా ఆదుకుంటుందో చెబుతుంది. ఈ కథ విన్నా వ్రతఫలం దక్కుతుందట.


