News November 18, 2025

పొగ మంచు వాతావరణంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

ప్రస్తుత శీతాకాలంలో పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. తెల్లవారుజామున, రాత్రివేళ సాధ్యమైనంతవరకు ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలప వద్దని అన్నారు. ఆ సమయంలో హాజర్ లైట్లను ఆన్ చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.

Similar News

News November 18, 2025

వాట్సాప్‌లో మీసేవ సర్వీసులు ప్రారంభం

image

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్‌లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం శాబ్దీనగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల పురోగతిని పరిశీలించి లబ్ధిదారురాలు చింతల సుమలత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల తీరు, బ్యాంక్ రుణం, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇసుక సరఫరా వంటి అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.