News September 12, 2024
పొతంగల్: సీఎస్సీ నిర్వాహకురాలి ఇంటికి తాళం, వేలం

పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో కాజేసిన రూ.45 లక్షలు సకాలంలో చెల్లించక పోవడంతో కెనరా బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వాహకురాలి ఇంటికి మహిళా సంఘాల సభ్యులు బుధవారం తాళం వేశారు. అనంతరం ఆ ఇంటిని వేలం వేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.14.80 లక్షలకు దక్కించుకున్నాడు. సదరు మహిళ నెల రోజుల్లో కాజేసిన సొమ్ము చెల్లిస్తానని బాండ్ రాసిచ్చి రూ.6 లక్షల చెల్లించి కాలయాపన చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.
Similar News
News March 11, 2025
NZB: పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి సంకెళ్లు

పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్‌లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్‌లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
News March 11, 2025
నిజామాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని అంబం(వై) గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలిలా.. అంబం(వై) గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న(55) గ్రామ శివారులోని పెద్దవాగులో సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
News March 11, 2025
NZB: గీతకార్మికుడిపై ఎలుగుబంటి దాడి

గీత కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో జరిగింది. కలిగోట్ కోరట్ పల్లి సరిహద్దులో గల వాగులో మెతుకు రాములు అనే గీత కార్మికుడు ఈతచెట్ల వద్దకు కల్లు తేవడానికి వెళ్లగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. అతని చేతికి స్వల్పగాయమైంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.