News September 26, 2025
పొదిలి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైకుపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 27, 2025
ప్రకాశం: ‘ఒకరికి ఒక్క ఓటే ఉండాలి’

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని DRO చిన్న ఓబులేసు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్‌లో శుక్రవారం గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ.. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారు, వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18ఏళ్ళు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
News September 27, 2025
ప్రకాశం: ‘పన్నుల తగ్గింపుపై ప్రచారం చేయాలి’

వస్తు సేవా పన్నులను ప్రభుత్వం తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు శుక్రవారం తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MROలు, ఎంపీడీవోలతో శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వస్తు సేవల పన్ను తగ్గింపుపై విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News September 27, 2025
జీఎస్టీపై విస్తృత ప్రచారం చేయాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు స్పష్టంగా వివరించాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్, పీఎం కుసుమ్, అన్న క్యాంటీన్లు, చెత్త సేకరణలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ రాజబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అంశాలపై మాట్లాడారు.