News December 18, 2025

పొన్నలూరు: బాకీ డబ్బుల కోసం మహిళ నిరసన.!

image

పొన్నలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ మధురైకి చెందిన మహిళ గురువారం అతని ఇంటి ఎదురుగా నిరసనకు దిగింది. తమ నుంచి రూ.68 లక్షలు తీసుకొని, చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడం లేదంటూ మధురై నుంచి వచ్చి నిరసన తెలిపింది. సదరు వ్యక్తి లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనూక్ మాట్లాడి నిరసన విరమింపజేశారు.

Similar News

News December 19, 2025

ప్రకాశం: 18 మంది కార్యదర్శులకు నోటీసులు.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 18 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు డీపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పంచాయతీలకు సంబంధించి ఇంటి పన్నులను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కార్యదర్శులకు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లోగా రాత పూర్వకంగా తమకు సమాధానం ఇవ్వాలని డీపీఓ ఆదేశించారు.

News December 19, 2025

ప్రకాశంలో పెద్ద మిస్టరీ.. 38408 కార్డుల కథేంటి..?

image

ప్రకాశం జిల్లాలో 38408 స్మార్ట్ రేషన్ కార్డుల యాజమానుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయని అధికారుల వద్ద ఉన్న లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోనియెడల త్వరలో సరెండర్ చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.

News December 19, 2025

ప్రకాశం జిల్లాలో వీరి కల నెరవేరేదెన్నడో?

image

సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే కేంద్రం పీఎం గ్రామీణ ఆవాస్ యోజన ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. నవంబర్ 6 నుంచి జిల్లాలో ఈ సర్వే కొనసాగింది. మొత్తం 38 మండలాల్లో 729 పంచాయతీల్లో 41,706 మంది సొంతింటి కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. వీరి దరఖాస్తుల రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయగా, ప్రస్తుతం వీరి సొంతింటి కల నెరవేరడమే తరువాయి భాగం.