News April 15, 2024
పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

పొన్నూరు పట్టణ శివారు జీబీసీ రోడ్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ప్రశాంత్(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక యువకుడు మన్సూర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పొన్నూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 10, 2025
13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News September 10, 2025
రేపు అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో కురుష్, పెదకాకాని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్చరీ, పల్నాడు జిల్లా నందిగామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెపక్ తక్ర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు సంబంధిత స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు
News September 10, 2025
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.