News January 5, 2025
పొన్నూరు: ముంచేసిన Instagram పరిచయం
పొన్నూరుకు చెందిన ఆళ్ళ రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగి ఇన్‌స్ట్రాగ్రాంతో పరిచయమైన విజయవాడ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేయడంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బాధితురాలిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. తనడబ్బు ఇప్పించాలని వాపోయారు.
Similar News
News January 7, 2025
GNT: జిల్లాలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా.?
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 17,96,356 మంది ఓటర్లు ఉన్నారని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరి రివిజన్‌పై అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
News January 7, 2025
వృద్దులు, మహిళలకు ఫిర్యాదులపై శ్రద్ధ: ఎస్పీ
వృద్దులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి, చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సూచించారు. సోమవారం, జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు జనార్ధనరావు, రమేశ్, మురళీ కృష్ణ, PGRS సీఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News January 6, 2025
8న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు: DEO
గుంటూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8న “రంగోత్సవ్” జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జూనియర్ కళాశాలల విద్యార్థులు, ప్రైవేట్ స్కూల్స్‌లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. 8 అంశాల్లో పోటీలు జరుగుతాయని, dietboyapalemguntur@gmail.comలో సంప్రదించాలన్నారు.