News December 17, 2025

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

image

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.

Similar News

News December 19, 2025

అవతార్-3 రివ్యూ&రేటింగ్

image

పండోరా గ్రహంలోనే స్థిరపడిన జేక్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసే పోరాటమే అవతార్-3(ఫైర్&యాష్). జేమ్స్ కామెరూన్ ఎప్పటిలాగే మరోసారి తెరపై విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ట్రైబల్ విలన్‌గా ఊనా చాప్లిన్ చేసిన ‘వరాంగ్’ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్ ప్లే, నిడివి(3H 17M) మైనస్. BGM ఫర్వాలేదు. తొలి 2 పార్టులతో పోలిస్తే నిరాశపరుస్తుంది.
రేటింగ్: 2.25/5

News December 19, 2025

పోలవరం పెండింగ్ అనుమతులివ్వండి: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్‌ను CM చంద్రబాబు కోరారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో గంటపాటు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అనుమతులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని చూస్తోందని, భూసేకరణకు సిద్ధమైందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.

News December 19, 2025

జంట పేలుళ్ల దోషుల శిక్ష రద్దు పిటిషన్‌పై HC విచారణ

image

TG: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల దోషులకు HC ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. ఆరోగ్య, మానసిక స్థితి, పశ్చాత్తాప భావనను పరిగణించి మరణశిక్ష రద్దు చేయాలని నేరస్థులు పిటిషన్ వేశారు. తమ విచారణను మరో బెంచ్‌కు మార్చాలని కోరారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. 2007లో HYD జంట పేలుళ్లతో 46మంది చనిపోయారు. ఈ కేసులో MHకు చెందిన అనిక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లకు 2018లో ఉరిశిక్ష పడింది.