News August 14, 2024

పొలం చూసేందుకు వెళ్లి.. గుండెపోటుతో రైతు మృతి

image

పెనుబల్లి మండలం వీఎం బంజర్ సోమ్లానాయక్ తండాకు చెందిన రైతు తేజావత్ రాంబాబు (40) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఉదయం పొలం చూడటానికి వెళ్లి ఆకస్మికంగా కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 22, 2025

ఖమ్మం: 290 మంది కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు

image

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 18 నుంచి 1,339 మంది ఆశా కార్యకర్తలు 50 వేల ఇళ్లను సందర్శించి 1.61లక్షల మందిని పరీక్షించారు. ఇప్పటివరకు 290 మంది అనుమానితులను గుర్తించినట్లు DMHO డాక్టర్ రామారావు తెలిపారు. వీరికి తుది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు.. లక్షణాలుంటే భయం వీడి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

News December 22, 2025

ఖమ్మం జిల్లా రైతులకు రూ.68 కోట్ల బోనస్ జమ

image

ఖమ్మం జిల్లాలో సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ సొమ్మును ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 22,000 మంది రైతులకు రూ.68.34 కోట్లు చెల్లించారు. ఇంకా 11,900 మందికి రూ.34.06 కోట్లు అందాల్సి ఉంది. అత్యధికంగా కల్లూరు మండలంలో రూ.20.28 కోట్లు, వేంసూరులో రూ.8.87 కోట్లు జమ చేశారు. మిగిలిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.

News December 22, 2025

ఖమ్మంలో ఇవాళ డజన్ కోడిగుడ్లు రూ.90

image

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.50, వంకాయ 20, బెండకాయ 50, పచ్చిమిర్చి 46, కాకర 56, కంచకాకర 60, బోడకాకర 140, బీరకాయ 56, సొరకాయ 20, దొండకాయ 44, క్యాబేజీ 30, ఆలుగడ్డ 20, చామగడ్డ 26, క్యారెట్ 40, బీట్రూట్ 36, కీరదోస 26, బీన్స్ 50, క్యాప్సికం 46, ఉల్లిగడ్డలు 45, కోడిగుడ్లు(12) రూ.90 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.