News January 7, 2026

పొలవరానికి సీఎం రాక.. షడ్యూల్ ఇదే!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటల వరకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. డయాఫ్రం వాల్ నిర్మాణం, ఇతర కీలక పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 2.55 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.

Similar News

News February 16, 2026

పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

image

పీరియడ్స్‌లో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.

News February 16, 2026

భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీవాణి

image

భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా పోతంశెట్టి మంజుల ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. నూతన ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్‌లకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News February 16, 2026

ఎవరు ఎవరికి ‘బి టీమ్’?

image

TG: రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP ఎప్పటి నుంచో పరస్పరం ‘బి టీమ్’ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగానూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. కానీ ఇవాళ మేయర్, ఛైర్మన్ల ఎన్నిక వేళ పార్టీల అసలు ‘రంగు’ బయటపడింది. పదవులు దక్కించుకునేందుకు కామారెడ్డిలో కాంగ్రెస్, BRS కలవగా, అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి. దీంతో ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.