News January 2, 2026
పొలిటికల్‌గా అందుకే యాక్టీవ్ అయ్యా: పేర్ని నాని

యాక్టీవ్ పాలిటిక్స్ పై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, 2029 ఎన్నికల్లో కూడా పోటీ చేయనని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2024 ఎన్నికల తర్వాత జగన్ కష్టాల్లో ఉన్నందునే తాను యాక్టీవ్ అయ్యానన్నారు. రాముడికి ఉడతా సాయంగా జగన్‌కు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ ఇంటర్వ్యూలో పేర్ని చెప్పుకొచ్చారు.
Similar News
News February 18, 2026
ATP: రేపటి నుంచి రంజాన్.. ఉపవాస వేళలు

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభంకానుంది. అనంతపురం జిల్లాలో రేపటి ఉపవాస వేళలు ఇలా ఉన్నాయి.
☞ గుత్తిలో….
★ సహర్: ఉ.5-5.21
★ ఇఫ్తార్: సా.6.29
★ ఉపవాస కాలం: మొదటి రోజు సుమారు 13 గంటల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.
☞ నోట్: ప్రాంతాలను బట్టి వేళలు కొన్నినిమిషాలు మారొచ్చు.
News February 18, 2026
GWL: ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన

రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గద్వాల కలెక్టర్ సంతోష్ బుధవారం ఐడిఓసి మందిరంలో అభినందించారు. హైదరాబాద్ దోమలగూడ గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఈనెల 17న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గద్వాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. విష్ణు అనే విద్యార్థి లాంగ్ జంప్ లో మొదటి స్థానం, షాట్ పుట్‌లో రెండో స్థానం సాధించాడు.
News February 18, 2026
తిన్న తర్వాత 10 నిమిషాల నడకతో షుగర్ వ్యాధికి ఫుల్ స్టాప్!

భోజనం తర్వాత 10 ని.లు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్‌స్టైల్ కోచ్‌లు అంటున్నారు. ఈ చిన్న అలవాటు రక్తంలో షుగర్ లెవెల్స్ సడన్‌గా పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ 10 నిమిషాల నడక దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ముప్పును తప్పిస్తుంది.


