News January 13, 2026
పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.
Similar News
News January 28, 2026
NZB: అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె బాన్సువాడలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
News January 28, 2026
NZB:మున్సిపోల్స్.. కౌన్సిలర్ టికెట్ల కోసం వెంపర్లాట

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం ఆశావాహులు వెంపర్లాడుతున్నారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఎంపికపై అధికారికంగా జాబితా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు మిగతా పార్టీల నుంచి పోటీచేసే ఆశావాహులు అభ్యర్థనలు పెట్టుకోగా బరిలో ఎవరు నిలుచుబోతున్నారనేది మీమాంసగా మారింది. ఆశావాహులు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News January 28, 2026
నిజామాబాద్: 108లో ఉద్యోగాలు

108 అంబులెన్స్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT)గా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ తెలిపారు. NZB జిల్లాలో 20 పోస్టులకు BSC(BZC), BSC నర్సింగ్, GNM, DMLT చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో NZB జిల్లా ఆసుపత్రిలో బుధ, గురువారాలు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9100799106కు సంప్రదించాలన్నారు.


