News December 30, 2025

పోక్సో కేసులు 34% వరకు తగ్గుముఖం: సిద్దిపేట సీపీ

image

2025 పోలీస్ శాఖ వార్షిక నివేదికలో పోక్సో కేసుల్లో 34% తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ కేసులు 589 నుంచి 572కు తగ్గాయన్నారు. 731 ప్రాపర్టీ ఆఫన్స్ కేసుల్లో ఇప్పటి వరకు రూ.1,42,69,301 వర్త్ ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. 2024తో పోలిస్తే 2025లో మర్డర్ కేసులు 12% తగ్గాయన్నారు. 2024తో పోలిస్తే 2025లో 4% ఎక్కువ సాధారణ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు.

Similar News

News December 31, 2025

అల్లూరి: ‘స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి’

image

అల్లూరి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.

News December 31, 2025

త్వరలో 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: DGP

image

TG: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదనలు పంపామని, త్వరలో అనుమతి రానుందని చెప్పారు. కాగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 3 సార్లు (2016, 2018, 2022) మాత్రమే నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది.

News December 31, 2025

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ వద్దు: ఎస్పీ నితికా పంత్

image

నూతన సంవత్సర వేడుకల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. బుధవారం కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి ఆమె ఈస్గాం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. వేడుకల పేరుతో అతిక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.