News May 1, 2024
పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

పోక్సో కేసులో రామభద్రపురం మండలంలోని కోటశిర్లాం గ్రామానికి చెందిన నిందితుడు గర్బాపు వినయ్ కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొబ్బిలి రూరల్ సీఐ తిరుమలరావు మాట్లాడుతూ.. 2020లో బాలికను మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో జడ్జి నాగమణి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
Similar News
News April 21, 2025
విజయనగరం పీజీఆర్ఎస్‌కు 205 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 205 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, JC సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్లు మురళీ, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 205 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 138 వినతులు అందాయి. జేసీ సమీక్షిస్తూ గడువు లోపలే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
News April 21, 2025
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి: ఎస్పీ

బాధితుల సమస్యలను తక్షణమే చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, 7 రోజుల్లో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆయన ఆదేశించారు. భూతగాదాలకు సంబంధించి 17, కుటుంబ కలహాలు 2, మోసాలకు పాల్పడినవి 4, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
News April 21, 2025
విజయనగరం: ఘనంగా సివిల్ సర్వీసెస్ డే

సివిల్ సర్వీస్ అధికారులు నిబద్ధత నిజాయతీగా ఉండి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో పౌర వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారుల పని తీరులో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.