News November 7, 2024

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

విజయనగరానికి చెందిన కుమిలి సురేశ్‌కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో 2021లో పోక్సో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు వెల్లడైందన్నారు.

Similar News

News September 14, 2025

VZM: ‘గాలికుంటు వ్యాధిని నిరోధించండి’

image

విజయనగరం జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తన చాంబర్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నెలరోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు వేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు.

News September 13, 2025

VZM: ‘షరతులు లేకుండా వాహన మిత్ర అమలు చేయాలి’

image

వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, టాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికీ అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని బుచ్చన్న కోనేరు వద్ద కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 5వేల పింఛన్‌తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News September 13, 2025

మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.