News September 12, 2025
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష: VZM SP

తెర్లాం PSలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కంకణాల కిరణ్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. తెర్లాంకు చెందిన బాలిక నడుచుకుంటూ వెళుతుండగా అదే గ్రామానికి చెందిన కిరణ్ ఆమెను అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయగా పారిపోయాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు SP తెలిపారు.
Similar News
News September 12, 2025
విజయనగరం కలెక్టర్‌కు సన్మానం

విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
News September 12, 2025
VZM: ‘17 నుంచి సర్వికల్ కేన్సర్ పై అవగాహన కార్యక్రమాలు’

విజయనగరం జిల్లాలో సర్వికల్ కేన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి 2 వారాల పాటు నిర్వహించబోతున్నామని DMHO జీవనరాణి గురువారం తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ కేంద్రాల్లో స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
News September 11, 2025
VZM: జిల్లాకి చేరుకున్న 39 మంది యాత్రికులు

మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్‌లో చిక్కుపోయిన జిల్లాకు చెందిన యాత్రికుల్లో 39 మంది గురువారం క్షేమంగా చేరుకున్నారు. వీరికి విశాఖ విమానాశ్రయం వద్ద ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన స్వాగతం పలికి వారి యోగక్షేమాలను విచారించారు. తమ స్వస్థలాలు చేరుకునేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.మణికుమార్ ఏర్పాట్లు చేశారు.