News January 26, 2026
పోక్సో కేసు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో నిందితుడి అరెస్ట్

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2014 నాటి పోక్సో కేసులో పరారీలో ఉన్న నిందితుడు మహమ్మద్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు బెయిల్ పై వెళ్లి 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సీపీ ఆదేశాలతో ప్రత్యేక బృందం యూపీలోని బలరాంపూర్‌లో ఇతడిని పట్టుకుని నగరానికి తరలించింది. నిందితుడిని పట్టుకున్న బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
Similar News
News February 16, 2026
విశాఖలో శాప్ లీగ్ క్రీడా పోటీల పోస్టర్ విడుదల

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ‘శాప్ లీగ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ లీగ్‌లో భాగంగా ఈనెల 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చదరంగం (Chess) పోటీలు, 24న మర్రిపాలెంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
News February 16, 2026
ఈ నెల 18న విశాఖకు ముఖ్యమంత్రి రాక

విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 18న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ జెట్టికి చేరుకొని భారత రాష్ట్రపతికి స్వాగత కార్యక్రమం అనంతరం ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం.1:20 నిమిషాలకు విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా నుంచి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు.
News February 16, 2026
సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్‌కు అనుమతి..

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్‌కు రావాలని పోలీసులు కోరారు.


