News February 4, 2025
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: KMR ఎస్పీ
విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో ఆమె పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News February 4, 2025
UPDATE: దేవరకొండ మృతదేహం వెంకటేష్‌గా గుర్తింపు.!
దేవరకొండ పట్టణ శివారులోని తాటికోల్ రోడ్డు భాగ్యనగర్ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్‌గా కుటుంబీకులు గుర్తించారు. మృతుడు వెంకటేష్ చనిపోయే మనస్తత్వం కాదని, చాలా ధైర్యం కలవాడని కుటుంబీకులు తెలిపారు. వెంకటేష్ మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి, ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.
News February 4, 2025
జేఈఈ(మెయిన్) ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల
జేఈఈ (మెయిన్) ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. దీంతో పాటు రెస్పాన్స్ షీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి 6వ తేదీ వరకు వీటిపై NTA అభ్యంతరాలు స్వీకరిస్తుంది. జనవరి 22 నుంచి 29 వరకు జేఈఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ <
News February 4, 2025
దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు
దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.