News January 24, 2025
పోచంపల్లిలో కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ అశోక్ కుమార్ జైస్వాల్ పర్యటించారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమలు, చేనేత షాపులను పరిశీలించారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను అందజేస్తుందని తెలిపారు.
Similar News
News November 7, 2025
వందేమాతర ఉద్యమంలో గుంటూరు పాత్ర

వందేమాతర నినాదం స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905–11మధ్య ‘వందేమాతర యుగం’గా ప్రసిద్ధి చెందింది. ఈ పోరాటం ఉధృతి గుంటూరు జిల్లాలో మహోజ్వలంగా కొనసాగింది. చేబ్రోలులోని రెడ్డిపాలెం రైతు చిన్నపరెడ్డి బ్రిటిష్ పోలీసు అధికారిపై తిరగబడ్డారు. తుపాకీతో తన ఎద్దును కాల్చడంతో ఆగ్రహించిన చిన్నపరెడ్డి, ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదారు. ఈ నేరానికి ఆంగ్ల ప్రభుత్వం చిన్నపరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది.
News November 7, 2025
మెదక్ పోలీస్ మైదానంలో వందేమాతరం గీతాలాపన

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వందేమాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహించారు. ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందితో పాటు మెదక్ టౌన్, రూరల్, హవేలిఘనపూర్ పోలీసులు పాల్గొన్నారు. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ దేశభక్తి గీతానికి నేటికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా కార్యక్రమాన్ని చేపట్టామని ఎస్పీ తెలిపారు.
News November 7, 2025
న్యూక్లియర్ వెపన్ రేసు మొదలైందా?

అణ్వాయుధ పరీక్షలు చేస్తామన్న ట్రంప్ <<18207970>>ప్రకటన<<>> అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా, రష్యా, నార్త్ కొరియాలు మరోసారి న్యూక్లియర్ టెస్టులకు సిద్ధమవుతున్నాయి. ఇది క్రమంగా న్యూక్లియర్ వెపన్స్ రేసుకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా అణ్వాయుధ దేశాలైన UK, ఫ్రాన్స్, ఇండియా, పాక్ కూడా ఆ బాట పట్టొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 12K న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు అంచనా.


