News January 8, 2026
పోచంపల్లి అమ్మాయికి అరుదైన ఘనత

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆమె ముందు నృత్య ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశం పోచంపల్లికి చెందిన బడుగు నికితకు లభించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన రిహార్సల్స్‌లో నికిత ప్రతిభను చూసి ఢిల్లీ అధికారులు ప్రశంసించారని ఆమె తండ్రి శివశంకర్ ఆనందం వ్యక్తం చేశారు. నికిత ఈ ఘనత సాధించడంపై పోచంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 20, 2026
సింగరేణిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సింగరేణి సంస్థలో ఇంటర్నల్ అభ్యర్థులతో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. 17 జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ (టీ అండ్ ఎస్ గ్రేడ్-3) పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 20న మధ్యాహ్నం 12 నుంచి మార్చి 4న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
News February 20, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* విజయవాడలో కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* పెనమలూరు: KTM పండుకు పీటీ వారెంట్
* బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడ బెంజి సర్కిల్‌లో చీకటి వ్యాపారం
News February 20, 2026
WGL: ప్రత్యేక తరగతులపై కొరవడిన పర్యవేక్షణ!

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక వైపు కలెక్టర్ చెబుతున్న.. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ అధ్వానంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 8-9, సాయంత్రం 4.15 -5.15 గంటల వరకు స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, వాటిపై పర్యవేక్షణ లేదు. గతంలో మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందిచే ఇన్విజిలేటర్ డ్యూటీస్, టెస్టులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.


