News March 1, 2025
పోచంపల్లి: ఉచిత శిక్షణ కార్యక్రమం

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాలేషన్, మొబైల్ ఫోన్ రిపేరింగ్ (సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్), ఏసీ రిప్రజెంటర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్‌పై ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి తెలిపారు.
Similar News
News December 14, 2025
తూ.గో జిల్లాలో పులి కలకలం

గోపాలపురం మండలం భీమోలు మెట్టపై పులి సంచరిస్తోందన్న ప్రచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి, రెండు పిల్లలు కనిపించాయని రైతు రామకృష్ణ ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం పాదముద్రల కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. నిఘా కోసం ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News December 14, 2025
న్యూస్ అప్‌డేట్స్

✦ ‘పాలమూరు’ ఫేజ్-1కి అనుమతులు ఇవ్వాలని, ఏపీ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
✦ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
✦ తెలంగాణలో పురుషుల సగటు ఆయుర్దాయం (67) కంటే మహిళలదే (73) ఎక్కువ.. ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ 2022 డేటా ఆధారంగా నివేదిక ఇచ్చిన కేరళ వర్సిటీ
News December 14, 2025
వికారాబాద్: తొలగనున్న కేజీబీవీ విద్యార్థుల కష్టాలు

VKB జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి. చలికాలంలో విద్యార్థులకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో 17 KGBVలకు 2,748 బెడ్లు కావాలని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 KGBVలకు ప్రభుత్వం 2,130 బెడ్లు మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే KGBVలకు బెడ్లు పంపిణీ చేయనున్నారు.


