News April 23, 2025
పోచంపల్లి: ఉరి వేసుకొని యువకుడి సూసైడ్

భూదాన్ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి గ్రామ పరిధిలోని బుడగ జంగాల కాలనీకి చెందిన పర్వతం కిరణ్ కుమార్ (24) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 23, 2025
టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla
News April 23, 2025
టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. 13వ స్థానానికి చేరుకున్న నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో టెన్త్ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఆశాజనకంగా నమోదయ్యాయి. గతేడాది 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో జిల్లా నిలవగా.. తాజాగా 83.58 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు.