News December 16, 2025

పోచంపల్లి: నాడు క్లాస్‌మేట్స్, నేడు సర్పంచులు

image

నిరుపేద కుటుంబాల్లో జన్మించి పోచంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను ఆభ్యసించి ఇద్దరు విద్యార్థులు నేడు రెండు గ్రామపంచాయతీల సర్పంచులయ్యారు. పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009-10 బ్యాచుకు చెందిన ధీరావత్ వెంకటేష్ నాయక్ ఇంద్రియాల గ్రామ సర్పంచ్‌గా గెలుపొందాడు. శాపాక లింగస్వామి జలాల్పూర్ సర్పంచిగా గెలుపొందాడు.

Similar News

News December 17, 2025

తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

image

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

News December 17, 2025

కడప జిల్లాలో 47,822 రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్

image

కడప జిల్లాకు 5,73,675 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. వీటి పంపిణీకి గడువు ముగిసింది. 47,822 కార్డులు మిగిలిపోయాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 చెల్లించి పోస్ట్ ద్వారా పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు డివిజన్లో 17,514, కడపలో 14,455, బద్వేల్‌లో 11,112, పులివెందులలో 4,741 రేషన్ కార్డులు మిగిలిపోయాయి.

News December 17, 2025

ఇతిహాసాలు క్విజ్ – 99

image

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>