News April 10, 2025

పోచంపల్లి: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ 

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ రిపేరింగ్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ – మెయింటెనెన్స్ , హౌస్ వైరింగ్, జర్దోజి(అడ్వాన్సుడ్) శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Similar News

News March 1, 2026

ఖమ్మం: ఆ 32 ఎకరాల భూదాన్ భూములు ఎక్కడ?

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ భూములు రికార్డుల్లో మొత్తం 62 ఎకరాలు ఉండగా.. ఇందులో 32 ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. కాగా బడా బాబుల చేతిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, వాటిపై ప్రభుత్వం మౌనం వహిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భూదాన్ భూములు 30 ఎకరాలే ఉండగా.. మిగిలిన 32 ఎకరాల భూముల లెక్కలు తేల్చాలని డిమాండ్ వినిపిస్తుంది.

News March 1, 2026

ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

image

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News March 1, 2026

గద్వాల: కాంగ్రెస్‌లో వర్గపోరు.. తారాస్థాయికి ‘గ్రూపు’ సెగలు!

image

జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకపోవడంపై కేడర్‌లో అసహనం వ్యక్తమవుతోంది.