News November 24, 2025
పోచంపల్లి : బైక్ పైనుంచి పడి యువకుడు మృతి

భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపల్ కేంద్రానికి చెందిన పొట్టబత్తిని సాయి కుమార్ (25) ఆదివారం రాత్రి ఫంక్షన్ నుంచి వస్తుండగా కుక్క అడ్డు రావడంతో బైక్‌పై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో సాయి కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
Similar News
News November 24, 2025
విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

విశాఖ లైట్ హౌస్ బీచ్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 24, 2025
సిద్దిపేట: అమ్మా.. నన్ను కొడుతున్నారు.. ఇవే చివరి మాటలు

సెలూన్‌కు వెళ్లిన యువకుడు తనను నలుగురు కొడుతున్నారంటూ తల్లికి ఫోన్ చేశాడు. తల్లి వెంటనే అక్కడికి వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ములుగు మం. బస్వాపూర్ వాసి నర్సంపల్లి సందీప్(21) తుర్కపల్లి కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సెలూన్‌కు వెళ్లి ఇంటికి రాలేదు. తల్లి రేణుక ఫోన్ చేయగా నలుగురు కొడుతున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేయగా వెళ్లి చూస్తే చనిపోయి ఉన్నాడు.
News November 24, 2025
కొడంగల్: ‘CM TOUR’ షెడ్యూల్ విడుదల

సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారంలో పాల్గొని
మధ్యాహ్నం 2.40గంలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్‌కు బయలుదేరుతారు. 3.55 గంటల నుంచి 4.55 వరకు అక్షయపాత్ర గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5గం. హైదరాబాద్ బయలుదేరుతారు.


