News November 9, 2025
పోచంపల్లి: రెండు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి

పోచంపల్లి మండలం జలాల్ పురంలో విషాదం జరిగింది. కొడుకు అంతక్రియలు నిర్వహించిన మూడో రోజే తండ్రి చనిపోయారు. గ్రామానికి చెందిన మహేందర్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఈనెల ఆరో తేదీన చనిపోయాడు. తండ్రి గడ్డం ప్రభాకర్ గతనెల 30న వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా కోతులు అడ్డుపడడంతో స్కూటీపై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.
Similar News
News November 9, 2025
వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్

వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. కాగా వీకేండ్ కావడం, రెండు రోజుల సెలవుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగి వచ్చి సందడి చేస్తున్నారు.
News November 9, 2025
GWL: టీబీ డ్యామ్ ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు సాగునీరు

కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు నూతన గేట్లు అమర్చేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని తెలిపారు. రబీలో క్రాప్ హాలిడే ప్రకటించి కొత్త గేట్లు అమర్చుతామని తెలిపారు. విషయాన్ని ఆయకట్టు రైతులు గ్రహించి సహకరించాలన్నారు. ఈ విషయమై 3 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News November 9, 2025
గండేపల్లి: వరి కోత యంత్రానికి విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరి మృతి

గండేపల్లి మండలం రామయ్యపాలెం శివారున ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వరి కోత కోస్తున్న యంత్రానికి విద్యుత్ వైర్లు తగలడంతో యంత్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


