News October 23, 2025
పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

పోచారంలో కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్ చెప్పిన ప్లేస్ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.
Similar News
News October 23, 2025
WNP: ప్రజల నమ్మకం గెలిచేలా పోలీసులు పనిచేయాలి: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణే ప్రతి పోలీసు ప్రధాన ధ్యేయం కావాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని రామకృష్ణారెడ్డి గార్డెన్‌లో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆయన నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 23, 2025
MBNR: పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి నెల వారి నేర సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైమ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి న్యాయస్థానాల్లో దోషులకు శిక్షపడేలా బలమైన సాక్ష్యాలు సేకరించాలన్నారు.
News October 23, 2025
MLG: 500 ఓటర్లున్నా జనాబాలో జీరో చూపిస్తోంది: స్థానికులు

జంకుతండ గ్రామ పంచాయతీలో 200కు పైగా ఎస్సీ కుటుంబాలు, 500కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఒక్క వార్డు సభ్యుడి స్థానం కూడా కేటాయించలేదని స్థానికులు తెలిపారు. 2011 జనాభా లెక్కల్లో ఎస్సీ జనాభాను ‘జీరో’గా చూపించారు. ఈ మేరకు ఎస్సీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగరాజు, భరత్, సోమయ్య పాల్గొన్నారు.